క్రిస్టమస్
క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.[2][3] కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7[4]న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం యేసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు[5] అయినందునో లేదా వింటర్ సోల్టీస్[6] అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.
| క్రిస్మస్ | |
|---|---|
| ఇలా కూడా అంటారు | క్రీస్తు యొక్క మాస్, క్రిస్మస్ |
| జరుపుకునే వాళ్ళు | క్రైస్తవులు అనేకమంది క్రైస్తవేతరులు[1] |
| రకం | క్రైస్తవ, సాంస్కృతిక |
| ప్రాధాన్యత | యేసు జననం |
| తేదీ | డిసెంబర్ 25 (పాశ్చాత్వ క్రైస్తవం)జనవరి 6 (ఆర్మేనియా అపోస్తలుల చర్చి)జనవరి 7 (అనేక తూర్పు ఆర్థడాక్స్ చర్చులు) |
| ఆచరణలు | ప్రార్ధనలు, కానుకలు ఇచ్చుట, కుటుంబ సమావేశాలు, చెట్లను అలంకరించుట |
| సంబంధం | Annunciation, Advent, Epiphany,Baptism of the Lord, Winter solstice |
నిర్వచనము[మార్చు]
క్రిస్ట్ (Christ) అగా క్రీస్తు, లాటిన్ భాషలో మాస్ (Mass) అనగా ఆరాధన. క్రీస్తుని ఆరాధించి ఆయనను కీర్తిస్తూ ఆనందించుటయే క్రిస్ట్మస్.
క్రీస్తు జన్మను గురించి బైబిల్ గ్రంధంలో వేద కాలం నాటి పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది.
- యోషయా 7:14 - "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మనుయేలు అని పిలుచును".
- మత్తయి సువార్త 1:18 - 25 - యేసు క్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వేరు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.| ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.| అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది. పరిశుద్ధాత్మ వలన కలిగినది;| ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.| ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు - అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్ధము.| యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్నాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని | ఆమె కుమారుని కనువరకూ ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.|
- లూకా సువార్త 1:26 - ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో|దావీదు వంశస్తుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. | ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి - దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.| ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి - ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత - మరియా, భయపడకుము; దేవుని వలను నీవు కృపపొందితివి.| ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;| ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.| ఆయన యాకోబు వంశస్తులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.| అందుకు మరియ - నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా| దూత - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.|
- యోహాను సువార్త 3: 16 - 35 లో "దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియుందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అయనను అనుగ్రహించెను:. అని వ్రాయబడియున్నది.
ConversionConversion EmoticonEmoticon