Nehru is also a Magician

   

నెహ్రు కూడా మేజిషియనే!


     ఒకసారి నెహ్రుగారు జపాన్ పర్యటించినప్పుడు ఒక ధనికుడి ఇంట్లో డిన్నర్ కి వెళ్లారు. అక్కడ పాత్రలన్నీ వెండి తో చేసినవి. చెంచాలు, ఫోర్కులు బంగారంతో చేసినవి ఉన్నాయి. నెహ్రు అంతరంగిక బబృందంలోని ఒక వ్యక్తీ ఆ బంగారు చెంచాలను చూసి ముచ్చటపడి రెండు చెంచాలను తీసుకొని తన జేబిలో వేసుకున్నాడు. వంటకాలు రుచిగా వుండటం వలన ఎవరూ ఇది గమనించలేదు చాచా నెహ్రు తప్ప.
     డిన్నర్ తరువాత నెహ్రు అందరినీ ఉద్దేశించి "లేడీస్ అండ్ జంటిల్మన్! మీ అందరికీ మేజిక్ ఇండియాలో ఆవిర్భవించిందని తెలుసుకదా! ప్రతీ భారతీయుడు అంతో ఇంతో ఇంద్రజాలం చేయగలడు. ఇప్పుడు నేనొక అంశం ప్రదర్శిసిస్తాను" అని చెప్పి రెండు బంగారు చెంచాలను తీసుకుని తన కోతుజోబిలో ఉంచుకొని"హ్రీం హ్రీం-సోనేకా చెంచా చలే జావ్"అని ప్రేక్షకులతో అంతకముందు చెంచాలు దొంగలించిన వ్యక్తిని చూపించి తన మేజిక్ శక్తిద్వార తన జేబులోని చెంచాలను అతని జేబులోనికి రాప్పించాను చూడమని అన్నారు. అతని జేబులో చూడగా చెంచాలున్నాయి. హాలంతా చప్పట్లతో మొగిపోయింది.

     తన అంతరంగిక సహాయకుడు చేసిన దొంగతం బయటపడకుండా ఒక చమత్కారం చేసి ఆ చెంచాలను బయటపెట్టించిన నెహ్రు కూడా మేజిషియనే మరి!

                                                                                                          ---P. Goutham Sai.---




Previous
Next Post »