Source:- Wikipedia.


ఆంధ్ర ప్రదేశ్
| ఆంధ్ర ప్రదేశ్*వేదిక |
| ఆంధ్ర ప్రదేశ్ | |
| రాజధాని - అక్షాంశరేఖాంశాలు | హైదరాబాదు - |
| పెద్ద నగరము | విశాఖపట్నం |
| జనాభా (2011) - జనసాంద్రత | 49,665,533[1] (10వది) - 310/చ.కి.మీ |
| విస్తీర్ణము - జిల్లాలు | 160205 చ.కి.మీ (8వది) - 13 |
| సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
| అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) | నవంబర్ 1 ,1956 - ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ - నారా చంద్రబాబు నాయుడు - శాసనసభ + శాసనమండలి (175 + 56) |
| అధికార బాష (లు) | తెలుగు - ఉర్దూ |
| పొడిపదం (ISO) | IN-AP |
| వెబ్‌సైటు: www.ap.gov.in | |
ఆంధ్ర ప్రదేశ్ రాజముద్ర | |
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఇది తెలుగువారి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరానఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా. ఆంధ్ర ప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.
1953 అక్టోబర్ 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరియు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. దాదాపు 58 సంవత్సరాల తరువాత జూన్ 2, 2014 న పునర్విభజింపబడింది ఆంధ్ర ప్రదేశ్. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాష తెలుగు రెండవ అధికార భాష ఉర్దూ. హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పది సంవత్సరాల వరకు కొనసాగుతుంది. దేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది.[2] విషయ సూచిక
1
చరిత్రప్రధాన వ్యాసము: ఆంధ్ర ప్రదేశ్ చరిత్రఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపుసంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకునిమరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ,తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.
భారత దేశ స్వాతంత్ర్యానంతరము1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదుసంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాదు 1948భారత దేశంలో విలీనమై, హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది.
మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమీషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడు కు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, 1970,ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగష్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి.
రాజకీయాలునీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసారు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసారు.
అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరములో తెలుగుదేశంఅనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.
2004 అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ళ అనతరం 2009లోజరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి మహాకూటమి తరఫున పోటీచేశాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి.సెప్టెంబరు 2, 2009నరాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు పాలించిన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా మార్చడం జరిగింది . నల్లారి కిరణకుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేయటంతో ఎన్నికలు దగ్గరబడుతున్నందున, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ఆసక్తి చూపనందున రాష్ట్రపతిపాలన విధించబడింది [3].
రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై ఉద్యమాలుప్రధాన వ్యాసము: తెలంగాణ ఉద్యమంప్రధాన వ్యాసము: సమైక్యాంధ్ర ఉద్యమమురాష్ట్రం ఏర్పడినతరువాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు దానికి పోటీగా సమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి.2009 లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణాఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ అమోదమైన లక్ష్యంకొరకు ప్రయత్నించినప్పటికి సత్ఫలితాలివ్వలేదు. 30 జూలై, 2013న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమము వూపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపై బడి సమైక్యాంధ్ర ఉద్యమము నడిచింది. 3 అక్టోబర్ 2013న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటుని ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్ మరియు బిల్లు తయారీ జరిగింది.[4] ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును [5]. శాసనసభ,శాసనమండలిలో సుదీర్ఘ చర్చల పూర్తికాకముందే ఒకవారం పొడిగించిన గడువు ముగిసే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి.[6].2014, ఫిబ్రవరి 18న ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది[7].20 పిభ్రవరి న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యథాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది [8]. జూన్ 2, 2014 న తెలంగాణా ప్రాంతం సీమాంధ్ర ప్రాంతాలనుండి వీడి క్రొత్త రాష్ట్రంగా ఏర్పడింది[9].
భౌగోళిక పరిస్థితి
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ భౌతిక పటము
కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)
ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు కలవు: కోస్తా ఆంధ్ర, మరియు రాయలసీమ. రాష్ట్రములో 13 జిల్లాలు కలవు. కోస్తా ఆంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములు కలవు. రాయలసీమలో ఎర్రటి నేలలు కలవు. ముఖ్య నగరాలు విశాఖపట్నం, విజయవాడ,కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, గుంటూరు,ఒంగోలు, మరియు మచిలీపట్నం. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.
జిల్లాలు
పంటలుమెట్ట భూముల్లో ఆయిల్ పామ్, బత్తాయి, నిమ్మ, చెరుకు, కొబ్బరి, కొకొవా, జొన్న, దానిమ్మ, జామ, సపోటా, మిర్చి, ప్రత్తి, పొగాకు, కూరగాయలు వంటివి పండిస్తారు. డెల్టా ప్రాంతాల్లో వరి, కొబ్బరి, కూరగాయలు, పండిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం చేపలు, రొయ్యలు సాగులో దేశంలోనే ప్రసిద్ధిగాంచినది.
రాష్ట్ర ప్రభుత్వము మరియు కార్య నిర్వహణ వ్యవస్థప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వముఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ (దిగువ సభ) లో 175 స్థానాలు, విధాన మండలి (ఎగువ సభ)లో 56[10] స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభ లో సభ్యుల సంఖ్య 175. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 36 స్థానాలు కలవు (లోక్ సభ లో 25 మరియు రాజ్య సభలో 11). ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి ఈ-ప్రభుత్వపాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఎపి ఆన్లైన్ అనే జాలస్థలి [11] కలిగివుంది.
రాష్ట్ర గుర్తులు
| విభాగం | పేరు | మాధ్యమం(అనుకూలమైతే) | ||||
|---|---|---|---|---|---|---|
| రాష్ట్ర భాష | తెలుగు | |||||
| రాష్ట్ర గుర్తు | పూర్ణకుంభం | |||||
| రాష్ట్ర గీతం | మా తెలుగు తల్లికి మల్లె పూదండ |
| ||||
| రాష్ట్ర జంతువు | కృష్ణ జింక | |||||
| రాష్ట్ర పక్షి | పాలపిట్ట | |||||
| రాష్ట్ర వృక్షం | వేప చెట్టు | |||||
| రాష్ట్ర ఆట | చెడుగుడు | |||||
| రాష్ట్ర నృత్యం | కూచిపూడి | |||||
| రాష్ట్ర పుష్పము | కలువ పువ్వు | |||||
| రాష్ట్ర జల చరము | డాల్ఫిన్ | |||||
నృత్యముప్రధాన వ్యాసం: కూచిపూడి నృత్యం
భారతదేశంలో ప్రముఖ నృత్యాల్లో ఒకటైన కూచిపూడి నాట్యానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాకు చెందినకూచిపూడి గ్రామం పుట్టినిల్లు. కూచిపూడి గ్రామంలో ప్రారంభమైన ఈ నృత్యరీతి ఆంధ్ర ప్రదేశ్ మొత్తానికే కాక దేశవిదేశాల్లో ఎందరెందరో నేర్చుకుని ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. కూచిపూడి వారు ప్రదర్శించే నృత్యనాటికలుభామా కలాపం, గొల్ల కలాపం వంటివి తెలుగు వారి సంస్కృతిలో భాగంగా నిలుస్తున్నాయి. దేవదాసీలు మాత్రమే ప్రదర్శిస్తూ ఆచారవంతులైనవారు నృత్యకారులను పంక్తిబాహ్యులని భావించే స్థితిలో కేవలం బ్రాహ్మణ పురుషులే అన్ని వేషాలు వేస్తూ, విద్యావంతులైన వారితో కూచిపూడి నృత్యరీతిని సిద్దేంద్ర యోగి వ్యవస్థాపించారు. కాలక్రమేణా నృత్యరీతి తెలుగువారి సంస్కృతిలో ముఖ్యభాగమైంది. 1950 నాటికి స్థానికంగా ఉండిపోయిన దీనికి జాతీయ స్థాయిలో మెప్పును, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపునూ తీసుకురావడానికి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి స్త్రీలను ప్రవేశపెట్టడం వంటి ప్రయత్నాలు చేసి యావజ్జీవితాన్ని కళకు అంకితం చేశారు.[12] కాకతీయుల కాలం నాటి నాట్యరీతులు తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్‌ల సంయుక్త సాంస్కృతిక చరిత్రలో భాగంగా చెప్పుకోవచ్చు. 13వ శతాబ్దిలో ప్రబలంగా ఉండి కాలక్రమేణా కాకతీయులతో పాటుగా అంతరించిపోయిన పేరిణి నృత్యం, పేరిణి తాండవ నృత్యం[13]వంటివాటిని పునరుద్ధరించడంలో ప్రముఖ నృత్యకళాకారులు నటరాజ రామకృష్ణ ఎనలేని కృషి చేశారు. దేవదాసీల ప్రదర్శనల్లో విలసిల్లి క్రమంగా దేవదాసీ వ్యవస్థతో పాటుగా అంతరించిపోతున్న నృత్యరీతులను, లక్షణ గ్రంథాల్లో సైద్ధాంతికంగా ఉండి ప్రయోగంలో తరతరాల నుంచి లేని నృత్యరీతులను దేవాలయల్లోని ప్రతిమల నాట్యభంగిమలను లక్షణ గ్రంథాలతో కలిపి అధ్యయనం చేసి అపూర్వరీతిలో ఆంధ్ర నాట్యం పేరిట పున:సృజించారు.[14]సినిమాతెలుగు సినిమా రంగంలో నటులు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు, గాయనీ గాయకులు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే. రాష్ట్రం నుండి ఉద్భవించిన కొందరు ప్రముఖ సినీ కళాకారులు నాగయ్య , ఎన్.టి.రామారావు (మాజీ ముఖ్యమంత్రి), అక్కినేని నాగేశ్వరరావు , ఎస్.వి.రంగారావు("ఎస్.వి.అర్) జగ్గయ్య, కృష్ణంరాజు, సాగి రాజన్ రాజు (ముక్కురాజు), శొభన్ బాబు, ఘంటసాల,ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుశీల, జానకి, సావిత్రి, భానుమతి, అంజలి జమున, శారద, షావుకారు జానకి, వాణిశ్రీ , ఎల్.వి.ప్రసాద్ , కె.వి.రెడ్డి , బి.యన్.రెడ్డి , బి.నాగిరెడ్డి, బాపు, రాజేంద్ర ప్రసాద్ , చిరంజీవి , జయప్రదమొదలైనవారు. హిందీ సినిమా రంగంపై తెలుగు కళాకారుల హవా మరియు ప్రత్యేకమైన ముద్ర గలదు.
ఇతర కళలు
విశాఖపట్నం జిల్లాలో ఏటి కొప్పాక అను గ్రామంలో ఇప్పటికీ చెక్క బొమ్మలు తయారగుచున్నవి. కృష్ణాజిల్లాలో కొండపల్లి అను గ్రామంలో కొండపల్లి బొమ్మలు తయారగుచున్నవి.
విద్యారంగముప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ లో విద్యఆంధ్ర ప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది. పర్యాటక రంగము
- ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి, ద్వారక తిరుమల (చిన్న తిరుపతి) , శ్రీశైలం, శ్రీ కాళహస్తి, సింహాచలము, అన్నవరం, అహొబిలము, మహానంది, కానిపాకం,విజయవాడ లో దుర్గ గుడి, గుణదల మేరీ మాత, గౌరీపట్నం లో నిర్మలగిరి మాత మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. ఇవే కాకుండా పంచారామాలు కూడా ఉన్నాయి.
- విశాఖపట్నం, పేరిపాలెం, గొల్లపాలెం, మచిలీపట్నం వంటి ఎన్నో బీచ్ లు ఉన్నాయి.
- పాపి కొండలు, బొర్రా గుహలు, అరకు లోయ, లంబసింగి వంటి ముఖ్యమైన పర్యాటకా ప్రాంతాలు కూడా ఉన్నాయి.
ConversionConversion EmoticonEmoticon