మానవసేవే మాధవసేవ అంటున్నకోట్లాధిపతులు.

మానవసేవే మాధవసేవ అంటున్నకోట్లాధిపతులు.

మనిషి తన జీవితకాలంలో ఎంత సంపాదించినా కాని చివరకు తను ఎత్తుకుపోయేది ఏమీ ఉండదు..అతనికి కావలిసింది కేవలం ఆరడుగుల నేత..ఈ రోజుల్లో ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. ఇతరులతో ఎంత పంచుకున్నామన్నది ముఖ్యం. అవును నిజమే ప్రపంచంలోని కుబేరులు ఇప్పుడు తమ సంపాదన ెంతన్నది చూడకుండా ఇతరులతో ఎంత పంచుకున్నామని చూస్తున్నారు. డబ్బే జీవితం అనుకోకుండా సేవా కార్యక్రమాలకు సంపాదించిన డబ్బును దానం చేస్తున్న వీరు నిజంగా మహ నీయులే...తమ సంపాదనలో 99 శాతం దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తున్న ఈ హీరోలు నిజంగా మహనీయులే. 
మార్క్ జుకర్‌బర్గ్ .....ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు( రూ. 10,560 కోట్లు ).
లైఫ్ టైమ్ డొనేషన్స్ 1.6 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 40.7 బిలియన్ డాలర్లు. ధనవంతులైన యువకుల్లో జుకర్ బర్గ్ ఒకరు. గేట్స్ ప్టెడ్జ్ కు కూడా చాలా పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. అలాగే ఎబోలా మహమ్మారి మీద పోరాటానికి 25 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు కూతురు పుట్టిన ఆనందంలో దాదాపు 3 లక్షల కోట్లను విరాళంగా ఇస్తున్నారు.

బిల్ గేట్స్.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ( రూ. 1,78,000 కోట్లు).

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు ముందు కూడా చాలామంది కోటీశ్వరులు తమకు తోచిన దానధర్మాలు చేసుండొచ్చు. అయితే సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం... మానవజీవితాన్ని సుఖమయం చేసే శాస్త్ర పరిశోధనలకు భూరి విరాళాలు అందించడాన్ని బిల్‌గేట్స్ ఒక ఉద్యమ స్థాయికి చేర్చారు. గేట్స్, వారెన్ బఫెట్‌లు ఇతర దాతలతో మాట్లాడుతున్నపుడు ‘గివింగ్ ప్లెడ్జ్'(సాయపడతామని ప్రతిజ్ఞ చేయడం) ఆలోచన కార్యరూపం దాల్చింది. 

అజీమ్ ప్రేమ్‌జీ.. చైర్మన్, విప్రో ..( రూ 52,800 కోట్లు )

లైఫ్ టైమ్ డొనేషన్స్ 8 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 15.9 బిలియన్ డాలర్లు. అజీమ్ ప్రేమ్ జీ పౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలను నడుపుతున్నారు. ఇండియా లోని స్కూల్ అలాగే పరీక్షల కోసం ఈ సంస్థ ఎంతగానో కృషి చేస్తోంది. అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీని స్థాపించి టీచర్ ట్రైనింగ్ లో సేవలు అందిస్తున్నారు. అంతేకాక ఇండియన్ స్కూళ్లలో కంప్యూటర్ ఎయిడెడ్ లియర్నింగ్ పోగ్రామ్ ను 18 భాషల్లో నేర్పిస్తున్నారు.

వారెన్ బఫెట్ సీఈవో, బెర్క్‌షైర్ హాత్‌వే ( రూ. 1,41,900 కోట్లు )

రెక్కల కష్టంతో పోగు చేసిన సొమ్మును దానం చేయాలంటే మానవమాత్రులకు అంత తొందరగా మనసు రాదు. భిక్షగాడు ధర్మం చేయమని చేయి చాచితే ఓ రూపాయి దానం చేయడానికి రెండుసార్లు ముఖం అటుఇటూ తిప్పి వేస్తుంటారు కొందరు. ఐతే ప్రపంచ మానవాళిలో పేదలకు చేయూతనిచ్చేందుకు ఏకంగా రూ. 12,600 కోట్లు దానం చేసినవారు ఉన్నారంటే నమ్ముతారా...? ఇది నిజం. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు బెర్క్ షైర్ హాత్ వే CEO వారెన్ బఫెట్ దానం చేశారు. తన కంపెనీ బెర్క్ షైర్ హాత్ వే కు చెంది 1.66 కోట్ల షేర్లను ఆ ఫౌండేషన్‌కు దానంగా ఇచ్చారు.



















Previous
Next Post »