చెన్నైలో క్షేమ సమాచారానికి ఫేస్‌బుక్ సేఫ్టీ చెక్ ఫీచర్.
కనికరం లేకుండా కరుస్తోన్న వర్షాలు, ఈ కారణంగా పొంగిపొర్లుతున్న వాగులు వంకలు వెరసి చెన్నై నగరాన్ని జల సంధ్రంలో ముంచేసాయి. వరుణుడి దెబ్బకు అతలాకుతలమైన చెన్నైలో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ 'సేఫ్టీ చెక్ ఫీచర్'ను యాక్టివేట్ చేసింది. గురువారం ఉదయం నుంచి ఈ టూల్ అందుబాటులోకి వచ్చింది. ఈ టూల్ ద్వారా వరద ప్రాంతంలో ఉన్న ప్రజలు తమ క్షేమ సమాచారాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులకు షేర్ చేయవచ్చు.

ConversionConversion EmoticonEmoticon