How to Loose Stage Fear(Telugu)

స్టేజ్ ఫియర్ పోవడానికి ఏమి చేయాలి?

Source:- Public Speaking Book by Dr.T.S. Rao.


     సభలో ఉన్నవారంతా నీకన్నా చాలా గొప్పవారని నీకేం తెలియదని అనుకుంటే నీకు భయం ఏర్పడుతుంది. ఏమీ మాట్లాడలేవు. అందుకని ముందు వరుసలో కూర్చున్న వారిని చూడకు. వెనుక వరుసలో వారిని చూస్తూ నువ్వు చెప్పదలచుకున్న మాటలను చెప్పు. నీకు భయం,బిడియం పోతాయి అని నెహ్రు తండ్రి శ్రీ మోతిలాల్ నెహ్రు గారు తన కుమార్తె నెహ్రు గారి సోదరి అయిని శ్రీమతి విజయలక్ష్మి పండిట్ గారికి ఉపన్యసకురలయిన ప్రారమ్భదశలొ ఈ సలహా ఇచారట. తదుపరి మహావాక్తగా రాణించిన విషయం విదితమే!
     మొదట కాస్త బిడియం ఉన్నా తరువాత ధైర్యం వస్తుంది. మరో విషయం మనం గుర్తుంచుకోవాలి. సభలోని వారికి ఏమి తెలియదనుకుని పోరాబాటుచేయకు. అది మరీ ప్రమాదం. 
     ఏ కళలొనైన ప్రారంభంలోనే ధైర్యంగా ఉండాలి. అలవాటైతే అంట తేలికైన విద్యగాని,కళగాని ఉండదు.
     ప్రారంభంలో ఉపన్యసకులలో అనేక లోపాలు ఉంటాయి. మాటకు మాటకు మధ్య తడబడుతువుంటారు. కొనదరికి నట్లు పడవచ్చును. కొందరికి గొంతు బొంగురు పోవోచ్చును. కొందరు అతి వేగంగా మాట్లాడతారు. స్పష్టత లోపిస్తుంది. వారిలో కొందరు తమలో తామే గొణుగుకుంటారు. మనకు వారు చెప్పేది వినిపించదు. అర్ధం కాదు. ఇటువంటి లోపాలని అధిగమించే పట్టుదల,కృషి ఉంటె ఉపన్యాసకులు అవడానికి అవకాశముంది.  


Previous
Next Post »